'ఆ సార్లు ఇబ్బంది పెడుతున్నారు' | students complaint on teachers for harassment | Sakshi
Sakshi News home page

'ఆ సార్లు ఇబ్బంది పెడుతున్నారు'

Published Tue, Dec 1 2015 4:25 PM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

'ఆ సార్లు ఇబ్బంది పెడుతున్నారు'

'ఆ సార్లు ఇబ్బంది పెడుతున్నారు'

సూర్యాపేట (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా సూర్యాపేటలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఇంగ్లీష్, మ్యాథ్స్ టీచర్లు తమను వేధిస్తున్నారని, చెప్పుకోలేని విధంగా తిడుతున్నారంటూ విద్యార్థినులు మంగళవారం షీ టీమ్‌కు  ఫిర్యాదు చేశారు. ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు అంజయ్య, మ్యాథ్స్ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌రెడ్డిలు నిత్యం తమను దుర్భాషలాడుతూ, మగపిల్లల పక్కన కూర్చోబెడుతూ రకరకాలుగా హింసిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

తాము ఇక పాఠశాలలో చదవలేమని, టీసీలు ఇచ్చి మరో పాఠశాలలో చేర్పించాలని వారు విద్యాశాఖాధికారికి రాతపూర్వకంగా విన్నవించారు. విద్యార్థినుల ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఇవాళ మధ్యాహ్నం వేధింపులకు గురి చేస్తున్న ఉపాధ్యాయులను  అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement