
డబ్బులివ్వలేదని చిత్రహింసలు
హైదరాబాద్: మానవత్వం మంట గలిసింది. పైశాచికత్వం విరుచుకుపడింది. డబ్బు బాకీ పడ్డాడని జహీర్‌ఖాన్ అనే వ్యక్తిని హైదరాబాద్ కూకట్‌పల్లిలోని సుమిత్రానగర్ హెచ్పీ పెట్రోల్ బంక్ సిబ్బంది చితకబాదారు. గుప్తనిధులు చూపిస్తానని బంక్ యజమానురాలి నుంచి జహీర్‌ఖాన్ దాదాపు 10 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం.
తన డబ్బు తిరిగి ఇవ్వాలని బంక్ యజమానురాలు జహీర్‌ఖాన్‌పై ఒత్తిడి తెచ్చారు. జహీర్‌ఖాన్ డబ్బు తిరిగివ్వకపోవడంతో యజమానురాలి ఆదేశంతో బంక్ సిబ్బంది జహీర్‌ఖాన్‌ను రెండు రోజులుగా బంధించి హింసించారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యజమానురాలితో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.