
వడదెబ్బకు 13 నెమళ్లు మృతి
ఎండ వేడిమికి తాళలేక, తాగేందుకు నీరు దొరక్క 13 నెమళ్లు మృత్యువాత పడ్డాయి.
రామాయంపేట (మెదక్ జిల్లా) : ఎండ వేడిమికి తాళలేక, తాగేందుకు నీరు దొరక్క 13 నెమళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో గురువారం వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రామాయంపేట నుంచి గురువారం ఓ బృందం అటవీ ప్రాంతంలో ఉన్న గౌరిరెడ్డి కుంటలో పూడికతీత పనులు ప్రారంభించేందుకు వెళ్లింది. అయితే అటవీ ప్రాంతంలోకి వెళ్లగానే.. ఎండకు తట్టుకోలేక, నీళ్లు దొరక్క మృత్యువాత పడ్డ 13 నెమళ్లు కనిపించాయి. ఇందులో ఐదు నెమళ్ల కళేబరాలు కుళ్లిపోయాయి. దీంతో విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. బీట్ అధికారి రాజయ్య వచ్చి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని అక్కడే దహనం చేశారు