
రాజకీయ అభద్రతకు గురవుతున్నారా?
సీఎం కేసీఆర్‌కు సురవరం లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజా ఆందోళనల పట్ల ఎందుకు ఆందోళన చెందుతున్నారని సీఎం కేసీఆర్‌ను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రశ్నించా రు. కేసీఆర్‌లో అంతర్గతంగా ఉన్న రాజకీయ అభద్రత భావం.. ధర్నాచౌక్ తరలింపు వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు దారితీస్తోందేమోనని ఆలోచించాలని సూచించారు. రాజకీయాల్లో నిరంతర పోరాటాలు అనివార్యమని, ప్రజాస్వామ్యం గొంతునొక్కే ప్రయత్నాలు విజయవంతంకావని లేఖలో పేర్కొన్నారు. ‘అధికారాంతమందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్’ అనే సామెత ఊరికే రాలేదన్నారు. గాంధీభవన్, ప్రెస్‌క్లబ్‌లలో జరిగే సభలకు కూడా పోలీసుల అనుమతి కావాలంటే ఇదేమి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.