వలస జీవులకు సర్వే కష్టాలు | survey problems to migratory people | Sakshi
Sakshi News home page

వలస జీవులకు సర్వే కష్టాలు

Aug 15 2014 11:06 PM | Updated on Mar 28 2018 11:05 AM

సమగ్ర సర్వే నేపథ్యంలో వలస జీవులు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. వారికి సరైన రవాణా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాండూరు రూరల్: సమగ్ర సర్వే నేపథ్యంలో వలస జీవులు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. వారికి సరైన రవాణా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రాత్రి ముంబై నుంచి రైలులో దాదాపు 1500 మంది తాండూరుకు చేరుకున్నారు.

 వీరంతా వివిధ గ్రామాలకు వెళ్లాల్సి ఉండగా బస్సులు లేక బస్టాండ్‌లో పడిగాపులు కాశారు. పిల్లాపాపలతో వచ్చిన వలసకూలీలు నానా తంటాలు పడుతూ కనిపించారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా అధికారులు వీరిని పట్టించుకోలేదు. జిల్లాలోని గండేడ్, మహహ్మదాబాద్, పరిగి, కుల్కచర్ల మండలాల ప్రజలు ఎక్కువగా ముంబైకి వలస వెళ్తుంటారు. సమగ్ర సర్వే ద్వారా తమకు ప్రభుత్వ పథకాలు అందుతాయని గంపెడాశలతో వలస జీవులు స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement