
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చేతుంపర్ల వల్ల వ్యాపిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు బయటకు వెళ్లినప్పుడు, పని ప్రదేశంలో ఉన్నప్పుడు ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అదేశించాయి. ఇక వైరస్‌ను అరికట్టడంలో మాస్క్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) స్వాతి లక్రా ప్రస్తుత కాలంలో మాస్క్ ధరించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేసే ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘మాస్క్ ధరించకపోతే క్రిములు ఎలా వ్యాపిస్తాయో చూడండి’అని కామెంట్ జత చేశారు.
How bacteria spreads if you don't wear a mask.....#MaskUp
Save yourself and save others too. #StaySafe pic.twitter.com/lOtrtaFUo9
— Swati Lakra (@SwatiLakra_IPS) June 29, 2020
మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ.. ఇతరుల్ని రక్షించండని స్వాతి లక్రా పేర్కొన్నారు. ఇక ఆమె పోస్ట్ చేసిన ఫొటోలో.. తుమ్మినప్పుడు, ఒక నిమిషం పాటు పాట పాడినప్పుడూ, ఇతరులతో మాట్లాడినప్పుడూ, దగ్గినపప్పుడు మాస్క్ ధరించేవారిలో, ధరించని వారిలో క్రిములు ఎలా వ్యాపిస్తాయి.. వాటి తీవ్రతను ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment