గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్యనేతల భేటీ | T Congress Leaders Meeting at Gandhi Bhavan  | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్యనేతల భేటీ

Published Thu, Jan 18 2018 4:07 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

T Congress Leaders Meeting at Gandhi Bhavan 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు గురువారం గాంధీభవన్‌ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. బేటీలో తెలంగాణలో నూతన పంచాయితీ రాజ్‌ చట్ట సవరణ వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త పంచాయితీ రాజ్ చట్టం తీసుకురావాలని యత్నిస్తున్న నేపధ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు. సీఎం కేసీఆర్ మూడేళ్ళ పాలనలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులే కానీ .. రాష్ట్ర నిధులు ఒక్క రూపాయికూడా ఇవ్వలేదన్నారు. పంచాయితీ రాజ్ చట్టంలో తీసుకొస్తున్న మార్పులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌లకు నేరుగానే ఎన్నికలు జరగాలని.. పరోక్ష ఎన్నికలకు తాము ఒప్పుకోబోమన్నారు. వార్డ్ మెంబర్స్ ను కొనుగోలు చేసేందుకే టీఆర్‌ఎస్‌ పరోక్ష ఎన్నికలంటోందన్నారు.

 ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడంలో టీఆర్‌ఎస్‌ బాగా ఆరితేరిందని విమర్శించారు. ఈ నెల 23 న అన్ని గ్రామ పంచాయతీలలో సమావేశాలు నిర్వహణ, 27న అన్నినియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి తహసీల్దార్లకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ నెల 30 న ఉమ్మడి జిల్లాల కలెక్టర్స్ కు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. డిసెంబర్ లో ప్రచురించాల్సిన ఓటర్ల జాబితా ఇంతవరకు ప్రచురించలేదని.. దాని వెనుక ఉన్న మతలబు ఏమిటీ .. ఈ జాప్యం వెనుక ఎవరున్నారని ఉత్తమ్‌ ప్రశ్నించారు. కొత్తగా ఏర్పాటు కాబోతున్న గ్రామపంచాయతీలకు మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం యాభై లక్షలు ఇవ్వాలన్నారు. ముందస్తు సర్పంచ్ ఎన్నికలు అంటే ప్రస్తుత సర్పంచులను అవమానించడమేనని తెలిపారు. రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకుల నుంచి ఇప్పించిన తర్వాతే కొత్త పాస్ బుక్స్ ఇవ్వాలని ఉత్తమ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement