
టైంపాస్ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా అసెంబ్లీహాల్ లోనే కాలయాపన చేస్తున్నారు. ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో అరెస్టైన తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందనే ఆశతో ఓటు వేయకుండా టైం పాస్ చేస్తున్నారు.
మరోవైపు ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు త్వరగా ఓటు వేయాలని రేవంత్ రెడ్డిని పోలీసులు కోరారు. 'నేను టీడీఎల్పీ ఉప నేతను..ఓటింగ్ సరళిని పరిశీలించాల్సిన బాధ్యత నాపై ఉంది' అని అధికారులతో రేవంత్ అన్నారు. ఓటు వేసిన తర్వాత ఆయనను పోలీసులు జైలుకు తరలించనున్నారు. ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కాసేపట్లో బెయిల్ పిటిషన్ వేయనున్నట్టు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు తెలిపారు.