
విద్యారణ్యపురి: పదో తరగతి ఫలితాలు సరిగా రాకపోతే.. ఏయే సబ్జెక్టుల్లో విద్యార్థులు తప్పారో.. ఆయా ఉపాధ్యాయులను పాఠశాల నుంచి బదిలీ చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలోని ప్రభుత్వ ప్రాక్టిసింగ్ హైస్కూల్‌లో రూ.21 లక్షల వ్యయంతో మూడు అదనపు గదుల నిర్మాణాలకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌తో కలసి ఆయన శంకస్థాపన చేశారు. టెన్త్‌లో మంచి ఫలితాలు సాధించేలా టీచర్లు విద్యాబోధన చేయాలని కడియం తెలిపారు. టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక క్లాస్‌లు తీసుకుంటూ వెనుకబడిన వారిపై శ్రద్ధ వహించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment