లేటంతా గేట్‌బెల్ట్‌తోనే... | technical problems in the gatebelt | Sakshi

లేటంతా గేట్‌బెల్ట్‌తోనే...

Sep 29 2014 3:19 AM | Updated on Sep 2 2018 4:16 PM

లేటంతా గేట్‌బెల్ట్‌తోనే... - Sakshi

లేటంతా గేట్‌బెల్ట్‌తోనే...

అడ్య్రాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు(ఏఎల్‌పీ) ఇంకా బాలారిష్టాల్లోనే ఉంది. సింగరేణి సంస్థకు ప్రతిష్టా త్మకంగా నిలిచిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో జాప్యం చోటుచేసుకుంటోంది.

యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : అడ్య్రాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు(ఏఎల్‌పీ) ఇంకా బాలారిష్టాల్లోనే ఉంది. సింగరేణి సంస్థకు ప్రతిష్టా త్మకంగా నిలిచిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో జాప్యం చోటుచేసుకుంటోంది. భూగర్భ గనిలో ఉన్న బొగ్గు నిల్వలు తీయడానికి ఆర్జీ-3 పరిధి లోని ఓసీపీ-2 ప్రాజెక్టు క్వారీలోని 150మీటర్ల లోతున పంచ్‌ఎంట్రీలు ఏర్పాటు చేసి  2008 ఫిబ్రవరిలో గని పనులు ప్రారంభించారు. మొదటగా రూ.660 కోట్లతో ఈభారీ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు ప్రారంభం ఆలస్యం కావడం, నిర్వహణ, యంత్రాల ఖర్చు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రాజెక్టు వ్యయం రూ. 1200 కోట్లకు చేరుకుంది. ఎన్నో అవాంతరాల మధ్య విదేశాల నుండి యంత్రాలను దిగుమతి చేసుకున్న యాజమాన్యం గనిపై జీడీకే-10ఏ గనిపై ప్రయోగాత్మ కంగా పరిశీలించిన అనంతరం రెండు నెలల కిందట లాంగ్‌వాల్ యంత్రం, దానికి సంబందించిన అనుబంద యంత్రాలు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను గనిలోని విజయ వంతంగా పంపించారు.

పనులు జరుగుతున్న తీరును గమనించిన సీఅండ్‌ఎండీ సుతీర్ధభట్టాచార్య ఆగస్టు 15 నాటికి అడ్య్రాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే యంత్రాల బిగింపు పక్రియ ఆలస్యం కావడానికి తోడు సాంకేతిక సమస్యలు ఉత్ప న్నం కావడంతో ట్రయల్న్ ్రఆలస్యమవుతూ వస్తోంది. లాంగ్‌వాల్ షేరర్ యంత్రం ప్రారంభం మొదలు బెల్ట్‌లు అన్నీ కంప్యూటర్‌తో అనుసంధానించి కంప్యూటర్ పోగ్రామింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు.
 
గేట్‌బెల్ట్‌లో సాంకేతిక సమస్యలు..
లాంగ్‌వాల్ యంత్రానికి సంబంధించిన యంత్రాలన్నీ సరిగానే పనిచేస్తున్నప్పటికి గేట్ బెల్ట్‌లో సంకేతి లోపం ఏర్పడింది. గేట్‌బెల్ట్‌లో నెలకొన్న సమస్యను సవరించేం దుకు జర్మనీనుండి ప్రత్యేక నిపుణులను రప్పించి నప్ప టికి బెల్ట్ పనితీరులో మార్పు కన్పించడం లేదు. కంప్యూటర్ పోగ్రామింగ్‌లో తేడా మూలంగా బెల్ట్ స్పీడ్‌గా నడవడం లేదని అధికారులు గుర్తించారు. దీన్ని మరమ్మ తులు నిర్వహించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా బెల్ట్‌లు, యంత్రాలు సరిగానే పని చేస్తున్నా గేట్‌బెల్ట్ మొరాయిస్తుడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు.
 
గతంలో తీసుకువచ్చిన ఇంజినీర్లు కొంత మేర పనులు పూర్తిచేసిన ప్పటికీ గేట్‌బెల్ట్ అనుకు న్నంత స్పీడ్‌గా పనిచేయడం లేదని గుర్తించారు. దీంతో ఇంగ్లండ్ నుంచి ఎక్స్‌పర్ట్‌ను రప్పిస్తున్నారు. సోమవారం ప్రాజెక్టుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావి స్తున్నారు. కంప్యూటర్ పోగ్రామింగ్‌లోని ప్రత్యేక సాఫ్ట్‌వే ర్‌ను లోడింగ్ చేస్తే పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అను కుంటున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే బుధ, గు రువారాల్లో ట్రయల్న్ ్రచేపట్టి బొగ్గును స్టాక్ పైల్ వద్దకు కన్వేయర్ బెల్ట్‌ద్వారా తరలించాలని యోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement