ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు! | telangana assembly session from september 23 | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!

Published Fri, Sep 18 2015 4:41 PM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM

telangana assembly session from september 23

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 23 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 23, 24న రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశముంది. 25, 26, 27 సెలవు దినాలు. మళ్లీ 28, 29, 30న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

శాసనసభ సమావేశాల నిర్వహణపై సీనియర్ మంత్రులతో సీఎం కేసీఆర్ గురువారం తన ఫామ్ హౌస్ లో చర్చించినట్టు తెలుస్తోంది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రతిపక్షం ఇరుకునపెట్టే అవకాశముండడంతో సమర్థ వ్యూహంతో ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.

శనివారం మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా రైతు ఆత్మహత్యలపై చర్చించే అవకాశముంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారం లక్షన్నర నుంచి రూ. 5 లక్షలకు పెంచే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement