
సాయంత్రం 6గం.లకు తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం భేటీ కానుంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సమావేశం జరగనుంది. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి చర్చించనున్నారు. వీటితో పాటే ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల మధ్య రగడకు దారి తీస్తోన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన అంశంపై కూడా చర్చ జరగనుంది. నవంబరు అయిదో దో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
మరోవైపు కేసీఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాల వారిగా ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. జిల్లాల సమస్యలను కేసీఆర్ అడిగి తెలుసుకోనున్నారు.