తెలంగాణ శాసనసభలో విపక్షాలు గురువారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో విపక్షాలు గురువారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సభలో పాస్ట్ పథకంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అలాగే డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై చర్చకు టీడీపీ, హైదరాబాద్లో శాంతి భద్రతలపై బీజేపీ, అంగన్వాడీ వర్కర్ల వేతనాల పెంపుపై సీపీఐ, గిరిజనులకు భూపంపిణీ, పోడు వ్యవసాయంపై సీపీఎం వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి.
అయితే వారం రోజులపాటు సస్పెన్షన్ గురైన టీడీపీ సభ్యులు గురువారం అసెంబ్లీకి హాజరుకానున్నారు. అలాగే సభలో రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులతోపాటు డీఎల్ఎఫ్ సంస్థకు భూ కేటాయింపులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.