రసకందాయంలో కాంగ్రెస్ రాజకీయం
డీసీసీ అధ్యక్షుడు ఐతం
సన్మానానికి ఏర్పాట్లు
ఒక వర్గం మోదం.. మరో వర్గం ఖేదం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు ముదిరి పాకాన పడుతోంది. జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జి అధ్యక్షుడిగా ఐతం సత్యం నియామకంపై కాంగ్రెస్‌లోని పలు వర్గాలు కారాలు మిరియాలు నూరుతుండగా.. ఆయన అనుకూలురు మాత్రం ఐతం సత్యం సన్మానానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత జిల్లాలోని కాంగ్రెస్ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి.14 సంవత్సరాలు ఏకచత్రాధిపత్యంగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు ఆ పదవి నుంచి వైదొలగిన తర్వాత పార్టీలోని వర్గాలు ఎవరికి వారు తమ అనుచరులకు డీసీసీ పట్టాన్ని కట్టబెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు.
ఈ తరుణంలో ఐతం సత్యానికి డీసీసీ ఇన్‌చార్జి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం కొందరికి మింగుడు పడలేదు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఐతం నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీకి లేఖాస్త్రం సంధించడంతో జిల్లా కాంగ్రెస్ పా ర్టీలో మరింత వేడి రాజుకుంది. ఈ చర్చ ఇంకా ముగియకముందే డీసీసీ నూతన అధ్యక్షుడికి సన్మానం చేసేందు కు పలువురు నాయకులు సమాయత్తం కావడం గమనార్హం. ఈ కార్యక్ర మం తమ సత్తా చాటుకునేందుకా..? లేక వ్యతిరేక వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకా..? అనేది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
సన్మానంపై సర్వత్రా చర్చ...
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం సరికాదని, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ఒకవైపు బలమై న వాదన వినిపిస్తున్న తరుణంలో ఐ తం సత్యంకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత డీసీసీ నియామక ప్రక్రియకు పీసీసీ ప్రయత్నం విఫలం కావడంతో ఈ పంచాయితీ ఏఐసీసీ కోర్టులోకి చేరింది. ఈ తరుణంలో అన్ని వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మాజీమంత్రి రాంరెడ్డి వర్గానికి చెందిన శీలంశెట్టి వీరభద్రం, రేణుకా చౌదరి వ ర్గానికి చెందిన వి.వి.అప్పారావు, పరుచూరి మురళీకృష్ణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గానికి చెందిన శ్రీనివాసరెడ్డి, అజయ్‌కుమార్ అనుచరుడైన ఎస్‌ఏఎస్ అయూబ్‌లతోపాటు ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సన్నిహితుడిగా పేరున్న ఐతం సత్యంతో కూడిన సమన్వయ కమిటీని నియమించారు.
జిల్లా లో అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా టీడీపీకి చెంది న తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్ లో చేరి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించి, ప్రభుత్వం అనుసరించే ప్ర జా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీ సుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో ధర్నాలు, రాస్తారోకోలతోపాటు పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిపైనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వయసు పై బడిన ఐతం సత్యం నియామకం పై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గానికి చెందిన పరుచూరి మురళీ కృష్ణ లేదా మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు శీలంశెట్టి వీరభద్రానికి డీసీసీ పగ్గాలు అప్పగిస్తారని ఎవరికి వారు ధీమాతో ఉండగా.. మధ్యేమార్గంగా భట్టి అనుచరుడు ఐ తం సత్యంకు ఈ పదవి అప్పగించడం గమనార్హం. నియామకం తర్వాత జరి గిన పరిణామాలను చక్కదిద్దేందుకు భట్టి విక్రమార్కతోపాటు పువ్వాడ అజయ్‌కుమార్ సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇందుకోసమే గురువారం భట్టి విక్రమార్క ముఖ్య అనుచరులైన కూల్‌హోం ప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ దుర్గాప్రసాద్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జావెద్ ఆధ్వర్యంలో అభినందన సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. శుక్రవారం పువ్వాడ అజయ్‌కుమార్ అనుచరులైన ఖమ్మం నగర అధ్యక్షుడు పొ న్నం వెంకటేశ్వర్లు, ఖమ్మం నగర మ హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మతోపాటు పలువురు మాజీ కౌన్సిలర్లతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఐతం సత్యం అభినందనసభను విజ యవంతం చేయాలని కోరారు. అయి తే ఈ పోస్టర్ ఆవిష్కరణ, విలేకరుల సమావేశానికి రాంరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గాలతోపా టు రేణుకాచౌదరి వర్గానికి చెందిన వా రెవరూ హాజరు కాకపోవడం విశేషం.
ముదురుతున్న వర్గపోరు
Published Sat, Dec 27 2014 1:50 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement