నల్లగొండ : తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ (వాటర్ గ్రిడ్) ప్రత్యేక విభాగాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నియమించిన అధికారులు విధుల్లో చేరారు. ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులకు ఉద్యోగోన్నతి కల్పించి జిల్లాకు నియమించారు. గ్రిడ్ పనులు పర్యవేక్షించే సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) స్థానానికి విజయ్‌పాల్‌రెడ్డిని నియమించారు. చౌటుప్పల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థానానికి సంపత్‌రెడ్డి, సూర్యాపేట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థానానికి జె.మధుబాబు నియమితులయ్యారు. ఈఎ న్‌సీ కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఈ ముగ్గురికి ఉద్యోగోన్నతి కల్పించి జిల్లా కు నియమించారు. జిల్లాలో రెండు సోర్సుల నుంచి కృష్ణా జలాలు సరఫరా చేయనున్నారు. దీంట్లో దామరచర్ల మండలం చిట్యాల వద్ద ఉన్న టెయిల్‌పాం డ్ ప్రాజెక్టుకు సూర్యాపేట ఈఈ, అక్కం పల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు చౌటుప్పుల్ ఈఈ నేతృత్వం వహిస్తారు.
డీఈలు..
ఆరు సబ్ డివిజన్‌లకు అవసరమయ్యే డీఈలను కూడా ఆర్‌డబ్ల్యూఎస్ నుంచే తీసుకోనున్నారు. వీరితోపాటు వివిధ మండలాలకు అవసరమయ్యే 17 మంది జేఈలను మాతృత సంస్థ నుంచే సర్దుబాటు చేయనున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఈఎన్‌సీ కార్యాలయం నుంచే జరుగుతోంది. రాజకీయ పలుకుబడి ఉన్న ఓ ఏజెన్సీకి నియామక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
ఎస్టిమేట్ల స్క్రూటినీ...
రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు కలిపి ఒక్కరే ఎస్‌ఈ. హైదరాబాద్‌లో సర్కిల్ కార్యాలయం ఉంటుంది. అక్కడి నుంచే ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తారు. ఇక చౌటుప్పుల్, సూర్యాపేటలో త్వరలో ఈఈ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు చోట్ల కార్యాలయాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ ఈఎన్‌సీ కార్యాలయం నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. టెయిల్‌పాండ్, ఏకేబీఆర్‌లకు సంబంధించిన ఎస్టిమేట్ల స్క్రూటీని చేస్తున్నారు. టెయిల్‌పాండ్ నుంచి తీసుకునే కృష్ణా జలాలకు రూ.1485 కోట్లు, ఏకేబీఆ ర్‌కు రూ.రెండు వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.
గ్రిడ్ అధికారులు వచ్చేశారు..!
Published Mon, May 11 2015 11:57 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement