హైదరాబాద్: ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య విమర్శించారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ బాగ్‌లింగంపల్లిలోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఐద్వా, డివైఎఫ్‌ఐ, తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చుక్కా రామయ్య మాట్లాడుతూ.. కార్పొరేట్ వైద్య సంస్థల దోపిడీ విపరీతంగా పెరిగిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దళితులు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవోడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి జి.ఝాన్సీ మాట్లాడుతూ.. విద్య, వైద్యం అంగడి సరుకుగా మారిందని, కొనగలిగే శక్తి ఉన్నవారికే అవి అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య రంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని ఐద్వా జాతీయ నాయకురాలు టి.జ్యోతి డిమాండ్ చేశారు.
కనీస అవసరాలపై సర్కారు నిర్లక్ష్యం
Published Fri, Jul 15 2016 8:16 PM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
Advertisement