సీఎం ఆదేశించినా పట్టదా..
కార్పొరేట్ ఆస్పత్రులపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
సాక్షి, ఖమ్మం: ‘హెల్త్‌కార్డులుండీ.. వైద్యం కోసం వచ్చే ఉద్యోగులు, జర్నలిస్టు కుటుంబాలను రాజధానిలోని 9 కార్పొరేట్ ఆస్పత్రులు అడ్మిట్ చేసుకోకుండా నానుస్తున్నాయని, ఇలా చేస్తే వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారని, సీఎం స్వయంగా ఆదేశించినా.. ఇంత జాప్యమా.. తెలంగాణలో ఇది కుదరదు.’ అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు.
బుధవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ వైద్యాన్ని వ్యాపారంగా చేశారని, ఉద్యోగుల కుటుంబాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. సదరు కార్పొరేట్ ఆస్పత్రులకు 15రోజులు గడువిస్తున్నామని, ఆ తర్వాత చర్యలకు వెనుకాడమన్నారు. గత ప్రభుత్వాలు అపోలో ఆస్పత్రికి రూ.వేలకే రాజధాని నడిబొడ్డున కోట్ల విలువ చేసే భూమిని ఇచ్చాయని, ఉద్యోగులకు వైద్యం అందించాల్సిన విషయంలో చొరవ చూపించాల్సిన బాధ్యత మీది కాదా..? అని ప్రశ్నించారు.