సాక్షి, హైదరాబాద్: సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణలో ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారానికోసారి సామాన్య ప్రజల కోసం ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లాఖాన్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి వెంటనే స్పందించిన తమిళిసై.. ‘మీ ప్రతిపాదనకు నా ధన్యవాదాలు. ఈ విషయం నా దృష్టిలో కూడా ఎప్పటి నుంచో పరిశీలనలో ఉంది’ అంటూ రిప్లే ఇచ్చారు. దీంతో త్వరలోనే ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment