ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించబోమని జూనియర్ వైద్యులను తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.
హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించబోమని జూనియర్ వైద్యులను తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఎస్మా ప్రయోగించేందుకు వెనుకాడబోమని తెలంగాణ డీఎంఈ శ్రీనివాస్ అన్నారు. సమ్మెలో పాల్గొన్న జూనియర్ డాక్టర్లను ఆరు నెలల పాటు డిబార్ చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. సమ్మెను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
జీవో 107 ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలల పరిధిలోని 1,700 మంది జూనియర్ వైద్యులు అత్యవసర విధులు సైతం బహిష్కరించి గత 22 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం దిగొచ్చి తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని జూడాలు స్పష్టం చేశారు.