హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో చొరవ తీసుకుంటానని ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.