
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ విమోచన దినోత్సవం రోజు అమరుల గురించి మాట్లాడుకోవాలి తప్ప కేసీఆర్ గూర్చి మాట్లాడితే మన నోరే పాడైతది’ అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17న జరపుకునే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించవద్దని కొందరు మేధావులు తనకు చెప్పారని కేసీఆర్ మాటలు మాట్లాడుతున్నారు. మీది అసలు నోరేనా? అంటూ... ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి రాక ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారింగా జరపాలని డిమాండ్ చేసిన విషయాన్ని మరిచారా? అని మండిపడ్డారు. కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన మాటలలపై స్పందిస్తూ.. పదేళ్లు ఉంటామా? ఇరవై ఏళ్లు బతుకుతామా? అన్నది ముఖ్యం కాదు ప్రజల గుండెల్లో బతకాలని అన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి అని, అతడి త్యాగాన్ని కళ్లారా చూసి తట్టుకోలేక తన మంత్రి పదవిని సైతం వదిలేశానని కోమటిరెడ్డి... ఆగస్టు 27న ఒకే రోజు 118 మందిని రజాకార్లు పొట్టన పెట్టుకున్నారని చరిత్రను గుర్తు చేశారు. నిజాం, రజాకార్లపై వీరోచిత పోరాటం చేసిన బైరాన్‌పల్లి వీరులు నేటి తరానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బైరాన్‌పల్లికి ప్రతి ఏటా 20 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment