
ఆశించినస్థాయిలో బడ్జెట్ లేదు: జానారెడ్డి
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ నిరాశ కలిగించిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదన్నారు. ప్రధానాంశాలపై ఆశించినస్థాయిలో ప్రస్తావన లేదని పెదవి విరిచారు.
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా బడ్జెట్ ఉందని టీసీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారు 459 మందే అని ప్రభుత్వం పేర్కొనడం దురదృష్టకరమన్నారు.
వాటర్గ్రిడ్కు రూ. 25 వేల కోట్లు అవుతుందన్న టీఆర్ఎస్ సర్కారు ఆర్థిక బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని మాజీ మంత్రి జె. గీతారెడ్డి తెలిపారు. అన్ని పథకాలకు అరకొర కేటాయింపులే చేశారని అన్నారు. బడ్జెట్ అసంపూర్తిగా ఉందని విమర్శించారు.