సాక్షి,హైదరాబాద్: ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీలా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ,
‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆత్మ స్తుతి పర నిందలా మారింది. బడ్జెట్‌లో హామీల ప్రస్తావన లేదు. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో బడ్జెట్ ఉంది. ఇచ్చిన హామీల ప్రస్తావన ఏ ఒక్కటి లేదు. అప్పులు తెస్తామని మళ్ళీ చెప్తుంది. కాంగ్రెస్ తన మేనిఫెస్టో మర్చిపోయింది.
2,500 మహిళలకు ఇస్తామని చెప్పింది. కోటి మంది అక్క చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు. 8 నెలలుగా మహాలక్ష్మి కాస్త మహా నిరాశగా మారింది. ఆసరా పెన్షన్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో చెప్పారు. 4వేల పెన్షన్ ఇప్పటిదాక ఇవ్వలేదు. ఊదర గొట్టి బడ్జెట్‌లో పెట్టలేదు.
పేదల ప్రభుత్వం అన్న కాంగ్రెస్ ఎందుకు ఇవ్వటం లేదు. విద్యా భరోసా కార్డు, స్కూటిలు ఇస్తామన్నారు బడ్జెట్లో దాని ఊసే లేదు. ఆటో కార్మికులు వృత్తి నమ్ముకొని ఆటో నడుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి పొట్ట కొట్టింది. చేనేత కార్మికుల ప్రస్తావన లేదు. రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment