సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులతో సమానంగా అన్ని విభాగాల ఉద్యోగులకు 28 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) చెల్లించాలని, దీనిపై ఈనెల 5లోగా నిర్ణయం తీసుకోకుంటే సమ్మె తప్పదని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.భాస్కర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐఆర్ చెల్లింపునకు అంగీకారం కుదిరిందని, కేవలం పారిశుధ్య కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచారని అన్నారు.
ఈ విషయాన్ని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లామని, ఈనెల 5లోగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఈ హామీ మేరకు వేచి చూస్తామని, 7వ తేదీ నుంచి దశలవారీ ఉద్యమాన్ని చేపడతామన్నారు. 10న ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని, 16 తర్వాత ఎప్పుడైనా సమ్మె ప్రారంభిస్తామని భాస్కర్ చెప్పారు.
ఐఆర్ ఇవ్వకుంటే సమ్మె తప్పదు
Published Tue, Jul 1 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement