ప్రజానాట్య మండలి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
హైదరాబాద్: ప్రజానాట్య మండలి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా ఎన్.మారన్న, ఉపాధ్యక్షులుగా జగ్గరాజు, దేవేంద్ర, ప్రధానకార్యదర్శిగా టి.నర్సింహ, సహాయ కార్యదర్శులుగా సాంబరాజు, జోజి, సైదులు, కోశాధికారి కట్ట నర్సింహ, కార్యవర్గ సభ్యులుగా తిరుపతి, రాంబాబు, రవి, సిర్పలింగం, నాగభూషణం, దుర్గేష్, విజయలక్ష్మి, నరేంద్ర, శారద, జానీ, నర్సింహారెడ్డి, రామాచారి, సైదులు, కళ్యాణ్, రామచందర్, కుమార్, రవి, కుమార్, సదానంద్, వెంకన్న, అనిత, బండి సత్తెన్న తదితరులు ఎన్నికయ్యారు.