ఉప ఎన్నికలంటే టీఆర్‌ఎస్‌కు భయం | telengana tdp leader erraballi fire on trs govt | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికలంటే టీఆర్‌ఎస్‌కు భయం

Published Mon, Mar 30 2015 12:31 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

ఉప ఎన్నికలంటే టీఆర్‌ఎస్‌కు భయం - Sakshi

ఉప ఎన్నికలంటే టీఆర్‌ఎస్‌కు భయం

టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు: తొమ్మిది నెలల సమయంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, దీంతో ఉప ఎన్నికలకు వెళ్లాలంటే టీఆర్‌ఎస్ భయపడుతోందని టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

ఆదివారం తొర్రూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుత సమయంలో తెలంగాణలో ఉప ఎన్నికలకు వెళితే ఓడిపోతామనే వరంగల్ ఎంపీ పదవికి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పదవికి తలసాని శ్రీనివాస్‌యాదవ్  వంటి నేతలు రాజీనామా చేసేందుకు భయపడుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement