‘పది’ విద్యార్థులలో ఉత్కంఠ
- తల్లిదండ్రులలో ఆందోళన
- మారిన సిలబస్‌తో ఇబ్బందులు
- సరిగా సాగని విద్యాబోధన
- గ్రామీణ ప్రాంతాలలో అవస్థలు
బాన్సువాడ : బట్టీ విధానానికి స్వస్తి పలికి సామర్థ్యాల ఆధారంగా, విషయ అవగాహనతో విద్యార్థులు పరీక్షలు రాయాలని విద్యా శాఖ ప్రవేశపెట్టిన నూతన సిలబస్‌కు అనుగుణంగా విద్యాబోధన సాగడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం సిలబస్‌ను మార్చినా, బోధనలో మాత్రం అధికారులు శ్రద్ధ చూపలేదు. పరీక్షల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పదోతరగతి విద్యార్థులలో ఆం దోళన పెరుగుతోంది. నూతన సిలబస్‌తో కుస్తీ పడుతూనే మొదటిసారిగా కొత్త పరీక్షా విధానానికి వారు సిద్ధమవుతున్నారు. మార్చిన సిల బస్‌కు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినా, ప్రరుువేటు ఉపాధ్యాయులకు శిక్షణ కరువైంది.
నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ తది తర పట్టణాలలోని ప్రభుత్వ పాఠశాలలలో ఈ విధానం అమలవుతున్నా, మారుమూల గ్రా మాలలో మాత్రం కొత్త సిలబస్‌కు అనుగుణం గా బోధన జరలేదని విద్యార్థులే పేర్కొంటున్నా రు. కొత్త విధానంలో బోధించడంతోపాటు వి ద్యార్థులకు ప్రాజెక్టు పనులు అప్పగించడంలో పలువురు ఉపాధ్యాయులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పరీక్షలు ఎలా రాయాలోనని విద్యార్థులు, తమ బిడ్డల భవి ష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.
గందరగోళంగా ప్రాజెక్ట్ వర్క్
మారిన సిలబస్ ప్రకారం పాఠ్యాంశం పూర్తి కాగానే విద్యార్థికి ప్రాజె క్టు వర్క్ ఇవ్వాలి. దీనిని పూర్తి చేయడానికి విద్యార్థులు ప్రముఖుల జీవిత చరిత్ర, శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, ఇతర ముఖ్యాంశాల గురించి తెలుసుకోవాల్సి ఉం టుంది. ఇందుకోసం వారు నెట్ సెంటర్లపై ఆధారపడి ప్రాజె క్ట్ వర్క్‌ను పూర్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో నెట్ సౌకర్యం లేని విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రాజెక్టు వర్క్‌కు ఈ సారి 20 మార్కులను కేటాయించనుండడంతో ఉపాధ్యాయులు విద్యార్థి తెలివి అంచనాను బట్టి మార్కులు వేయాల్సి వస్తోం ది.
ఇదిలా ఉండగా, ప్రభుత్వం తెలుగు, ఇం గ్లిష్ మీడియం విద్యార్థులందరికీ ఒకే పరీక్షా వి ధానం అమలు చేస్తోంది. దీనితో ఇంగ్లిష్ మీడియంతో ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులు సొంతంగా ఆలోచించి రాయడం కష్టంగా మారింది. సాంఘిక శాస్త్రంలో సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన విద్యార్థులకు మాత్రమే గరిష్ట మార్కులు వచ్చే అవకాశం ఉం ది. గణితంలో కొన్ని అభ్యాసాలు, లెక్కలు చేస్తే పరీక్షల్లో గతంలో అవే తరచుగా వచ్చేవి. ప్ర స్తుత విధానంలో మాదిరి లెక్కలను సాధిం చడం ద్వారా మార్కులు పొందాల్సి ఉంది.
పూర్తి కాని సిలబస్
జిల్లాలోని ఇంకా కొన్ని పాఠశాలలలో కొత్త సిల బస్ పూర్తి కాలేదు. మారిన సిలబస్ ప్రకారం ఫిబ్రవరి చివరినాటికి కూడా పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంటోంది. పలు పాఠశాలలలో జనవరి సిలబస్ కూడా పూర్తి కాలేదు.ఈ పరిస్థితులలో కొత్త సిలబస్ ప్రకారం విద్యార్థులు పరీక్షలు రాయడం కష్టమేనని విద్యార్థుల తల్లిదండ్రులు చెబు తున్నారు. గతంలో డిసెంబర్ చివరి వరకు సిలబస్ పూర్తి చేసి, ఆ తర్వాత ప్రతి పాఠ్యాంశాలలో ఉన్న కీలక అంశాలు, ప్రశ్నలు, ఖాళీలు పూరించడం తదితర అంశాల పై పునశ్చరణ నిర్వహించేవారు. వెనుకబడినవారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసేవారు. డి-గ్రేడ్ విద్యార్థులను గుర్తించి వారిని కనీస ఉత్తీర్ణతా స్థాయికి తీసుకువచ్చే వారు. ఇదంతా డిసెంబర్ నుంచి మార్చి వరకు పూర్తి చేసేవారు. కానీ, ప్రస్తుతం అలా జరగడం లేదు. సిలబస్ పూర్తయి, మాదిరి పరీక్షల నిర్వహణ కూడా జరగని పా ఠశాలలు ఎన్నో ఉన్నాయి.
తల్లిదండ్రుల కోసం కొన్ని చిట్కాలు
- పిల్లలకు వీలైంత ప్రేమగా చెప్పి చది వించి ఫలితాలు సాధించాలి. తెల్లవారుజామున నిద్ర లేపాలి.
- ఈ నెల రోజులు ఇంట్లో టీవీకి కేబుల్ కనెక్షన్ తీసేయిస్తే మంచిది.
- పిల్లలు ఏ సబ్జెక్ట్ కష్టమని భావిస్తారో తొ లుత దాన్నే చదివించాలి. మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది.
- బుల్లెట్ పాయింట్స్, సైడ్ హెడింగ్స్‌తో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
- నెల రోజులకు సంబంధించి టైంటేబుల్ ను తయారు చేసుకొని, తేదీలవారీగా సబ్జెకులకు సమయం కేటాయించాలి.
- మ్యాథ్స్ చేయడం వచ్చునని, నిర్లక్ష్యం చేయకూడదు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చే యాలి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో థియరీలను ప్రాక్టీస్ చేయించాలి.
- రాత్రి పది గంటల వరకు చదివిస్తే సరిపోతుంది. అంతకు మించి మెలకువగా ఉంచితే పిల్లలు నిద్రలేమితో బాధపడుతారు. సమస్యలు వస్తాయి.
- రోజుకు కనీసం ఆరు గంటలు గాఢమైన నిద్ర పోయేలా చూడాలి.
- ఉదయం స్నానం చేశాక ఓ 20 నిమిషాలు మెడిటేషన్ లేదా యోగా చేయిస్తే ప్రయోజనం ఉంటుంది.
పరీక్షలు రాసేదెలా!!
Published Mon, Feb 23 2015 5:38 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement