సాక్షి, కడ్తాల్(రంగారెడ్డి) : కొన్ని నెలలుగా చిరుతపులి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లేగదూడలపై దాడి చేస్తూ రైతులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా కడ్తాల్ మండలం వాస్‌దేవ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నేరేళ్లుకోల్ తండాలో రైతు కేతావత్ దస్రునాయక్‌కు చెందిన పశువుల పాకపై శనివారం తెల్లవారు జామున చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో లేగదూడ మృత్యువాత పడింది.
వివరాల్లోకి వెళితే.. నేరేళ్లుకోల్‌తండాకు చెందిన రైతు కేతావత్ ద్రçసునాయక్ రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం వరకు పశువులను మేపి, తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న పాకలో వాటిని కట్టేసి ఇంటికి వచ్చాడు. తిరిగి శనివారం ఉదయం పశువుల పాలు పితికేందుకు పొలానికి వెళ్లి చూడగా.. పాక సమీపంలో లేగదూడ మృత్యవాత పడి ఉంది. వెంటనే రైతు తండా వాసులకు సమాచారం ఇవ్వడంతో వారంతా ఘటనా స్థలానికి చేరుకుని మృతిచెందిన దూడను పరిశీలించారు.
అనంతరం అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారి దేవేందర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన లేగదూడను, చిరుత పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇప్పటికైనా సంబంధిత అటవీ శాఖ ఉన్నతాధికారులు చిరుతను పట్టుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment