కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ సంక్షోభం లో పడింది.
16 నుంచి మూసివేతకు పారిశ్రామికవేత్తల నిర్ణయం
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ సంక్షోభం లో పడింది. పార్క్ ఏర్పాటు సమయంలో ఇస్తామన్న రాయితీలు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఈ నెల 16వ తేదీ నుంచి పరిశ్రమలు మూసివేయాలని పారిశ్రామికవేత్తలు నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ యూనిట్ రూ.4 ఉం డగా, ఇక్కడ ఎఫ్‌ఎస్‌ఏతో కలిపి రూ.8 వసూలు చేస్తున్నారు. పైగా బ్యాంకు రుణాలు పేరుకుపోవడంతో పరిశ్రమల వేలా నికి బ్యాంకు అధికారులు నోటీసులిచ్చారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ లో ప్రస్తుతం 130 యూనిట్లలో రెండువేల మంది కార్మికులు పనిచేస్తూ, ఆధునిక మగ్గాలపై వస్త్రం ఉత్పత్తి చేస్తున్నారు. పరిశ్రమలను మూసివేతపై కలెక్టర్, జౌళి శాఖ కమిషనర్, లేబర్ అధికారులకు సమాచారం అందించామని పార్క్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమలు మూతబడితే రెండువేల మందికి ఉపాధి కరువవుతుంది.