⇒ పారిశుద్ధ్య కార్మికులను దోచుకుంటున్న కన్సల్టెన్సీలు
⇒ ఈపీఎఫ్ రుణాలు ఇప్పించేందుకు కమీషన్లు
⇒ ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలకు పైగానే వసూళ్లు
⇒ చేష్టలుడిగి చూస్తున్న బల్దియూ అధికారులు
వారు నగరం నిద్ర లేవకముందే వీధుల్లోకి చేరుకుంటారు. తెల్లవారేకల్లా రోడ్లు, డ్రెరుునేజీలను శుభ్రం చేస్తారు. నగర పారిశుధ్యంలో వారి పాత్ర కీలకం. ఇంతా చేస్తే వారికి అందే వేతనాలు మాత్రం అతి తక్కువ. ఇందులో కొంతమేర పీఎఫ్ రూపంలో వెళ్తుంది. ఈ నిధి నుంచి అత్యవసర సమయంలో రుణం తీసుకునే వె సులుబాటు ఉంది. ఈ రుణాల కోసం వచ్చే కార్మికుల దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రత్యేక విభాగం ఉండాలి. కానీ.. మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో కన్సల్టెన్సీలు, సంఘాల పేరిట రంగప్రవేశం చేస్తున్న కొందరు కార్మికుల అవసరాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నారు. వారి దరఖాస్తులను పీఎఫ్ కార్యాలయంలో త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని చెప్పి నగదు వసూలు చేస్తున్నారు.
హన్మకొండ : వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజారోగ్య విభాగంలో 1,882 మంది, అర్బన్ మలేరియా విభాగంలో 60 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 372 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. 2011 జనవరి నుంచి ప్రతీ కార్మికుడి నెల వేతనంలో 13.61 శాతం మొత్తాన్ని ఉద్యోగ భవిష్యనిధి (ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)) కింద కోత విధిస్తున్నారు. ఈ మొత్తానికి సమాన మొత్తాన్ని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తన వంతు వాటాగా జమ చేస్తుంది. గత ఐదేళ్లలో ప్రతీ కార్మికుడి ఖాతాలో సగటున రూ.55 వేలు జమ అయింది. నిబంధనల ప్రకారం అత్యవసర సమయాల్లో భవిష్యనిధిలో ఎనభైశాతం మొ త్తాన్ని ఉద్యోగం చేస్తుండగానే పొందే సౌలభ్యం ఉంది. అత్యవసర సమయాల్లో ఈపీఎఫ్ సొమ్ము కార్మికులు అడ్వాన్‌సగా పొం దేందుకు అ వసరమైన ఏర్పాట్లు కా ర్పొరేషన్‌లో మానవ వనరుల విభా గం చేయాలి. కానీ.. వీరు పట్టించుకోకపోవడంతో కన్సల్టెన్సీలు, నాయకుల పేరుతో దళారులు రంగప్రవేశం చేశారు.
అధికారులకు ఇవ్వాలంటూ...
చాలీచాలని వేతనంతో నెట్టుకొస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఏదో అత్యవసరం వచ్చి పడుతుంది. వడ్డీకి డబ్బు తెచ్చుకునే బదులు ఈపీఎఫ్ నుంచి అడ్వాన్స్ తీసుకునేందుకు ముందుకొస్తారు. ఇలా ఏడాది కాలంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 70 దరఖాస్తులు నమోదయ్యాయి. వీటిలో కొందరు కార్మికులు అనారోగ్య కారణాలతో.. మరికొందరు వివాహం, చదువులు వంటి ముఖ్యమైన అవసరాల కోసమే దరఖాస్తు చేసుకున్నారు. అయితే గ్రేటర్‌లో మానవ వనరుల విభాగం లేకపోవడంతో వీరికి సాయం చేస్తామంటూ కొం దరు నాయకులు, కన్సల్టెన్సీలు రంగప్రవేశం చేశాయి. ఈపీఎఫ్ సొమ్ము మంజూరు చేసేందుకు దరఖాస్తు తయారీ, ప్రాసెస్ చేయడం, ప్రతీ విభాగంలో కమీషన్లు ఇవ్వాల్సి వస్తుందని నమ్మబలుకుతున్నారు. ఇందుకు ప్రతిగా తమకు తక్కువలో తక్కువ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాలంటూ మెలిక పెడుతున్నారు. ఐదేళ్లపాటు పైసాపైసా కూడబెట్టిన సొమ్ములో ఎక్కువ మొత్తం వీరికే చెల్లించాల్సి రావడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుునా అవసరం కావడంతో చెల్లిస్తుండగా... ఈపీఎఫ్ సొమ్ము మంజూరైన విషయం తెలిసిన వెంటనే ఆ ప్రతినిధులు తమ వాటా చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు.ఇంటికి మనుషులను పంపిస్తున్నారు. ఇక కన్సల్టెన్సీ, నాయకులకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన కార్మికులకు సంబంధించిన దరఖాస్తులు ఆమోదం పొందడం లేదు.
దీంతో ఈపీఎఫ్ అడ్వాన్‌స కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులు కన్సల్టెన్సీ, నాయకులు అడిగినంత చెల్లిస్తున్నారు. నెలనెలా కార్మికులు కూడబెట్టుకున్న సొమ్ము దోచుకుంటు న్నా... కార్మికుల సంక్షేమం పట్టించుకోవాల్సిన గ్రేటర్ అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నారుు.
అక్కెర సొమ్ముకు కత్తెర
Published Tue, Feb 2 2016 3:40 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM
Advertisement