అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చినబోయినపల్లి పంచాయతి పరిధిలోని గొట్టికాయగూడెంలో మంగళవారం జరిగింది. గూడానికి చెందిన దేవయ్య(32) తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో పత్తిపంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా దిగుబడి సరిగా లేకపోవడంతో.. చేసిన అప్పులు తీర్చే దారికనపడక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పులబాధ తాళలేక..
Published Tue, Sep 22 2015 2:11 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement