ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పూసం భద్రయ్య (50)కు రెండెకరాల పొలం ఉంది. దీనికితోడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. గతేడాది, ఈ ఏడాది కలిపి రూ.2 లక్షల మేర అప్పులు చేశాడు. వర్షాలకు పూత, పిందె రాలిపోవడంతో మనస్తాపం చెందిన భద్రయ్య సోమవారం రాత్రి పురుగుల ముందు తాగాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు.