కోల్‌సిటీ : ఉన్న డేటాను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపైనే హైదరాబాద్‌లో జరిగిన ‘మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సు’లో ప్రధాన చర్చ...
కోల్‌సిటీ : ఉన్న డేటాను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపైనే హైదరాబాద్‌లో జరిగిన ‘మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సు’లో ప్రధాన చర్చ జరిగిందని కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థల మేయర్లు రవీందర్‌సింగ్, కొంకటి లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన ప్రపంచ మేయర్ల సన్నాహక సదస్సులో జిల్లా మేయర్లతోపాటు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు.
పురపాలక, నగరపాలక సంస్థల్లో వాటర్ కనెక్షన్లు, ఎలక్ట్రికల్ మీటర్ల కలిగి ఉన్నవారి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించాలనే అంశంపై చర్చ జరిగిందని వారు తెలిపారు. ఈ డేటాను మల్టీపర్పస్‌గా ఎలా ఉపయోగించుకోవాలి.. ఎప్పటికప్పుడు ఎలా అప్‌డేట్ చేసుకోవాలి, ఇంటర్‌లింక్ చేసుకునే పద్ధతిపై ఐటీ మంత్రి కె.తారకరామారావు సూచనలు చేసినట్లు తెలిపారు. స్మార్ట్‌సిటీల ఏర్పాటుపై రెండు సదస్సులు జరుగగా, గుజరాత్, పూణేలో చేస్తున్న అభివ ృద్ధి గురించి ఆయా రాష్ట్రాల ప్రతినిధులు వివరించారని చెప్పారు. గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ కోసం తీసుకుంటున్న చర్యలు, అర్బర్‌పూర్‌లోని స్లమ్‌ప్రాంతాల అభివ ృద్ధి, మౌలిక వసతుల కల్పనపై కొత్త అంశాలు తెలుసుకున్నట్లు వివరించారు.