► విధుల నుంచి తొలగిస్తా.. జాగ్రత్తగా పనిచేయండి
► ఉపాధి సిబ్బందిపై కలెక్టర్ కస్సుబుస్సు
► కూలీలకు పనులు కల్పించకపోవడంపై మండిపాటు
► అల్లాదుర్గంలో సమీక్ష సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్ రాస్
అల్లాదుర్గం: ఏం నిద్రపోతున్నారా?... విధుల ను జాగ్రత్తగా నిర్వహించకపోతే తొలగిస్తా.. ఇ ప్పటికే జిల్లాలో 13 మందిని తొలగించాం... మరో 120 మందిని తొలగిస్తే తెలుస్తుంది*.. అంటూ కలెక్టర్ ఉపాధి సిబ్బందిపై మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం అల్లాదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హమీ పథకం ఒక్కో గ్రామంలో 20, 30, 40, 70 మంది కూలీలు పని చేస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ సిబ్బంది అంతా హాయిగా ఉంటున్నట్టు రికార్డులను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 13 మందిని తొలగించాం, మరో 120 మందిని తొలగించినా తప్పులేదన్నారు. రూ.180 కూలి చెల్లించాల్సి ఉండగా వంద రూపాయలు కూడా ఎందుకు దాటడం లేదని ప్రశ్నించారు. అంతా నిద్రపోతున్నారా? అంటూ మండిపడ్డారు. మండలంలో 80 శాతం మరుగుదొడ్లు లేని వారు ఉన్నారని సర్వేలో పేర్కొనడంపై అనుమానం వ్యక్తం చేశారు.
అసలు సర్వే చేశారా?, ఇళ్లల్లో కూర్చోని రాశారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌నుంచి సోషల్ ఆడిట్ బృందాన్ని పిలిపించి ఆడిట్ చేయించి అందరిని విధుల నుంచి తొలగిస్తానని కలెక్టర్ హెచ్చరించారు. ఐకేపీ సిబ్బంది వ్యాపారాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుందన్నారు. సమావేశంలో డ్వామా పీడీ సురేందర్, ఎంపీడీఓ కరుణశీల, తహశీల్దార్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
ఏం నిద్రపోతున్నారా?
Published Sat, Dec 19 2015 3:26 AM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM
Advertisement
Advertisement