రుణమాఫీపై ఆందోళన వద్దు
డిచ్‌పల్లి, న్యూస్‌లైన్ : రైతు రుణమాఫీ అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదని, రుణమాఫీపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. శనివారం డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి ప్రాథమిక సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు. సహకార సంఘం పరిధిలోని ఇందల్వాయి, చంద్రాయన్‌పల్లి, త్రయంబక్‌పేట్ రైతులకు సబ్సిడీ సోయా విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిం చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటీని తమ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తప్పకుండా అమలు చేస్తారని స్పష్టం చేశారు.
రుణమాఫీపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం వారం రోజులు మాత్రమే అయిందన్నారు. రుణమాఫీకి సంబంధించి మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, బ్యాంకు అధికారులు స మాలోచనలు చేస్తున్నారని తెలిపారు. అరవై యేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సమస్య లు రాకుండా కేసీఆర్ కృషి చేస్తారన్నారు.
ఆందోళనలు అర్థరహితం
రుణమాఫీ గురించి ప్రతిపక్షపార్టీల రాస్తారోకోలు, నిరసనలు జరపడం అర్థరహితమన్నారు. అమరుల కుటుంబాలకు *10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు, కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇచ్చే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరుతో పాటు 10 గం టల నిరంతర ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామన్నారు. ఇందల్వాయి శివారులోని సర్వే నెంబరు 1107లోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 500 జనాభా కలిగిన ప్రతి గిరిజన తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
వైఎస్సార్‌తోనే రాజకీయ భిక్ష
ధర్పల్లి :తాను రాజకీయల్లోకి రావటానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అ న్నారు. ఆయనతోనే తనకు రాజకీయ భిక్ష లభించిందన్నారు. అందుకే ఆయన కు టుంబానికి అండగా ఉన్నానని అన్నారు. ప్రాణహిత- చేవెళ్ల పథకం కింద నియోజక వర్గంలోని 1.60 లక్షల ఎకరాల కు సాగునీరు అందేలా కృషి చేస్తానని అన్నారు. మండలకేంద్రంలోని సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఆయన సోయా విత్తనాలు పంపి ణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ధర్పల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సామర్థ్యం పెంచేలా చూస్తానన్నారు. పసుపు పరిశోధన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. డీఎస్‌ది ఎన్నిక ల్లో టికెట్లు అమ్ముకునే సంస్కృతి అని ఆరోపించారు. ఆయన అభివృద్ధి చేసేది వచ్చిన నిధుల్లో కమీషన్లు దోచుకునేందుకే విమర్శించారు. సోనియా వద్ద చెంచాగిరి చేస్తే ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణ రాష్ట్రం రావటానికి కేసీఆర్ పాత్ర కీలకం అన్నారు. కేసీఆర్ కుటుంబానికి అండగా ఉంటానని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ఓటమి భయంతోనే ఉచిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారన్నారు.