బెజ్జూర్ : సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు మండలంలోని ఎల్కపెల్లి (పి) సర్వే నంబర్ 61లో గల ప్రభు త్వ భూమిని కేంద్రం ప్రభుత్వం బృందం మంగళవారం పరిశీలించింది. ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఈఈపీసీడీ సంస్థలకు చెందిన 13 మందితో కూడిన బృందం స్థలా న్ని చూశారు. గతనెల 24వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో కేంద్ర ప్రభుత్వ బృందం సమావేశమైంది. అందులో భాగంగానే ఏర్పాటు చేసిన కమిటీ జిల్లాలో పర్యటించి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు సర్వేలు చేస్తున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. పరిస్థితుల అంచనా.. స్థితిగతులపై విచారణ.. అనుకూల వాతావర ణం తదితర అంశాలను క్రోడీకరించి సమగ్రంగా సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
200 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్తత్పి ప్లాంటు ఏర్పాటు చేసేందుకు వీలుగా స్థలం ఉందని కేంద్ర ప్రభుత్వం బృందం ఈ మేరకు అంచనాకు కూడా వచ్చింది. ఇప్పటివరకు చేపట్టిన సర్వేలో ఎల్కపెల్లి(పి) గ్రామంలోని భూమి సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉన్నట్లు అభిప్రా యం వారిలో కనిపించింది. సహజ వనరులను విని యోగించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సో లార్‌హబ్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చా రు. నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని అనుమతులిస్తే పది నెలల్లో ప్లాంటు ఏర్పాటవుతుందని వారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటుకు సర్వేలు పూర్తిచేశామన్నారు.
ఎల్కపెల్లిలోని ప్రభుత్వ స్థలం నుంచి ఎయిర్‌పోర్ట్, రైలు మార్గం, 400 వాట్ల విద్యుత్‌లైన్, జాతీయ రహదా రి, 220 మెగావాట్ల విద్యుత్ కేంద్రం తదితర అంశాలు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకున్నారు. కాగా.. సోలార్‌ప్లాంటును ఎల్కపెల్లిలో ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమై నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సిర్పూర్ ఎమ్మె ల్యే కోనేరు కోనప్ప వారికి వివరించారు. బృందం వెంట ఎన్‌టీపీసీ మేనేజర్ గాలి సందర్, ఎన్‌వీవీఎుం సంస్థ ఏజీఎంలు బీకే దాస్, అనురాగ్‌గుప్త, ఎన్‌హెచ్‌పీసీ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ, తెలంగాణ పరిశ్రమల శాఖ డిప్యూటి డెరైక్టర్ డి.వినయ్‌కుమార్, నెఫ్‌కో సినియర్ మేనేజర్ రఫీక్ హుస్సేన్,తహశీల్దార్ విశ్వంబర్, డిప్యూ టీ తహశీల్దార్ రఫత్, ఆర్‌ఐ సంతోష్, ట్రాన్స్‌కో ఏడీఈ శ్రీనివాస్‌రావు, ఏఈ శివప్రసాద్, సర్పంచ్ పరమేశ్, ఎంపీటీసీలు సముద్రాల సత్యనారాయణ, సాజిత్, తదితరులు ఉన్నారు.
సోలార్ ప్లాంటు కోసం స్థల పరిశీలన
Published Wed, Dec 3 2014 2:11 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement