నీళ్లు తొడటానికని బావి వద్దకు వెళ్లిన విద్యార్థిని ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందిన సంఘటన అదిలాబాద్ జిల్లా కౌథాల మండలం వీర్‌వెల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉష(16) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ రోజు తాగునీరు తేవడానికి బావి వద్దకు వెళ్లింది. బావిలోంచి నీరు చేదే క్రమంలో ప్రమాదవశాత్తూ బావిలో జారిపడింది.
ఇది గుర్తించిన స్థానికులు ఆమెను బయటకు తీయడానికి ప్రయత్నించేలోపే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.