బావిలో విష గుళికలు కలిపిన ప్రేమికుడు | Lover mixed Posion in Well | Sakshi
Sakshi News home page

బావిలో విష గుళికలు కలిపిన ప్రేమికుడు

Published Mon, Jul 13 2015 4:30 PM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

Lover mixed Posion in Well

కుంటాల (ఆదిలాబాద్): ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహం జరగడంతో ఆ యువకుడు ఉన్మాదిగా మారాడు. యువతికి చెందిన గ్రామంలోని తాగునీటి బావిలో విషపు గుళికలు కలిపాడు. ఆ నీటిని సేవించి ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం బూగురుపల్లి జి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల మేరకు... సారంగాపూర్ మండలం నేకతండాకు చెందిన ఆడెరాజు బూరుగుపల్లికి చెందిన ఓ యువతిని గతంలో ప్రేమించాడు. అయితే ఆమెకు నేకతండాకు చెందిన వేరొక వ్యక్తితో పెళ్లి జరగడంతో తనకు దక్కుండా పోయిందని ఉన్మాద చర్యకు పాల్పడ్డాడు.

ఆదివారం రాత్రి బూరుగుపల్లికి బైక్‌పై వచ్చి గ్రామస్తులు తాగునీటికి వినియోగించే బావిలో విషపు గుళికలు కలిపాడు. సోమవారం ఈ నీటిని సేవించి గ్రామంలోని ఐదుగురు అస్వస్థత పాలయ్యారు. దీంతో అధికారులు స్పందించి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. కాగా నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement