ఖమ్మం : ఖమ్మం జిల్లా బయ్యారంలో దోపిడి దొంగలు ఆదివారం అర్థరాత్రి రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గేట్ చేసుకున్న దొంగలు ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు రూ.1.50 లక్షల నగదు, 8 తులాల బంగారం, 17 తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతో బాధితులు సోమవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బయ్యారంలో దొంగల హల్‌చల్
Published Mon, Aug 10 2015 10:35 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement
Advertisement