
ఇదేనా.. మానవత్వం..?
శాతవాహన యూనివర్సిటీ: ఒక కాకి చనిపోతే వంద కాకులు వచ్చి కావ్...కావ్‌మని అరుస్తాయి.. అలాంటిది ఏకంగా ఓ మనిషి శవమై కనిపించిన కనికరించని అధికారులు వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మానవత్వంపై ప్రసంగాలు గుప్పించే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి శవాన్ని చూసి వెళ్లారే తప్ప శవపంచానామా చేయాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పోలీసులు, కార్మికుల వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన వీరసాహెబ్(52) కొద్ది రోజులుగా నగరంలో కూలీ పనిచేసుకుంటూ జీవనంసాగిస్తున్నారు.
మంగళవారం రాత్రి కరీంనగర్ కార్పొరేషన్ ఆవరణలో నిద్రించాడు. అక్కడ పార్కింగ్ చేసిన కారు తీసే క్ర మంలో టైర్ల కింద పడి చనిపోయాడు. బుధవారం ఉదయం 10.30గంటల సమయంలో మృతదేహాన్ని చూసిన కార్మికులు మేయర్ రవీందర్‌సింగ్‌కు ఫోన్‌చేసి తెలిపారు. ఆయన చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. కారు ప్రమాదంలో జరిగిన సంఘటనగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వాహన ప్రమాదం కావడంతో ఈ కేసు ట్రాఫిక్ వెళ్తుందని చెప్పి అక్కడ ఉన్న క్లూస్‌తో తీసుకుని వారు వెనుదిరిగారు.
అక్కడే ఉన్న కొందరు 108కి సమాచారం అందించారు. చనిపోయిన వారిని తీసుకెళ్లడం తమ బాధ్యత కాదని 108 సిబ్బంది వెళ్లిపోయారు. అధికారులు... పోలీసులు.. ట్రాఫిక్ పోలీస్‌లు.. ఇలా ఒకరంటే మరొకరని చుట్టపుగా వచ్చి చూసివెళ్లారు. సెలవు దినం కావడంతో కార్పొరేషన్‌లో ఎవరు లేరని, అసలే కుక్కల బెడద ఎక్కువగా ఉంటుందని, అలాంటి ఆవరణలో శవం దగ్గర ఎవరినీ ఉంచకపోవడంతో ప్రజలు ఇదేం చోద్యమని చర్చించుకున్నారు.
కనీసం ఓ కార్మికున్నో... కానిస్టేబుల్‌నో ఉంచాలన్న కనీస బాధ్యతను పాలకులు, పోలీసులు మరిచారన్న విమర్శలొచ్చారుు. ఉదయం 10.30 గంటలకు జరిగిన సంఘటనపై రాత్రి 6 గంటలకు ట్రాఫిక్ సీఐ మహేశ్‌గౌడ్ మృతుడు వీర సాహెబ్ కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. కుటుంబసభ్యులు ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మృతిపై పలు అనువ ూనాలు...?
కారు మీది నుంచి పోతే వీరసాహెబ్ ఎందుకు అరవలే దు? అసలు కారు ఎక్కితే అక్కడిక్కడే చనిపోయే పరిస్థితు లు ఉంటాయా? అసలు ఇది కారు ప్రమాదంతో జరిగిన సంఘటనా.. వేరే విధంగా వీరసాహెబ్ మృతి చెంది ఉం టారన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కార్పొరేషన్‌లో కాపలా కరువు
కార్పొరేషన్‌లో కార్యాలయంలో నైట్ వాచ్‌మెన్ అన్ని ఉ న్నా వలస కార్మికుడు శవమై కనిపించడం కాపలా లేమికి అద్దం పడుతోంది. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే కార్పొరేషన్ లో మంత్రులు, నగర మేయర్, ఎమ్మెల్యేలు, ఉ న్నతాధికారులెందరో వస్తారు. అలాంటి చోట గట్టి నిఘా ఉంచాల్సిన అధికారులు కనీసం గేట్ వద్ద కాపాలా ఉంచకపోవడంతో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలోనూ పలు సంఘటనలు...
కార్పొరేషన్‌లో అవరణలో వాహనాలు నిలిపి ఉండి బాంబు స్క్వాడ్ వరకు వెళ్లి సంఘటనలు ఉన్నాయి. గతంలో ఓ వాహనం చాలాకాలంగా నిలిపి ఉండడంతో దానిలో ఎవరో మందుపాతరలు ఉంచారనే అనుమానాలతో పోలీసులు తనిఖీలు చేశారు. ప్రస్తుతం బస్టాండ్‌లో బాంబు బూచీల బెడద అడపాదడపా ఉంటున్నట్లు హైరానా జరుగుతున్న దాని ముందే ఉన్న కార్పొరేషన్‌పై అధికారులు నిఘా ఎందుకు పటిష్టం చేయడం లేదో అంతుచిక్కడం లేదు. వాహనం వచ్చింది...పోయింది తెలియకుండానే కార్మికుడి మృతదేహం ఉండడం కార్పొరేషన్ కాపలా డొల్లాతనం ఇట్టే అర్థమవుతోంది.