ఈ నెల 16 తేదీన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు,
నల్లగొండ: ఈ నెల 16 తేదీన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో స్వచ్ఛభారత్, స్వచ్ఛతెలంగాణ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మెడికల్ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్ర మాన్ని ఉదయం 7 గంటలకు ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పాటించడంతో పాటు, అ వసరమైన చోట గోడలకు సున్నాలు వేయడం, మరుగుదొడ్లు శుభ్రపరచడం, పైప్‌లైన్లు మరమ్మతులు చేయించడం, మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తీయడం తదితర కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
అలాగే ఆసుపత్రుల గదులకు సంబంధిత పేర్లు తెలిపేవిధం గా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో రోగుల బెడ్లు, దుప్పట్లు మార్చడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అవసరమైతే ఆసుపత్రి అభివృద్ధి నిధులు వినియోగించుకుని కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మండలంలో ఉన్న ఒక పీహెచ్‌సీకి పోలీస్‌స్టేషన్ సిబ్బందిని అనుసంధానం చేశామన్నారు. పోలీస్ శాఖ సిబ్బంది కూడా స్వచ్ఛ భార త్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని గుర్తించి వివరాలు పంపాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్, జేసీ సత్యనారాయణ, డీఆర్‌ఓ రవినాయక్, ఇన్‌చార్జి ఏజేసీ నిరంజన్, డీటీసీ చంద్రశేఖర్ గౌడ్, ఆర్‌ఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.