అడవిపందిని తప్పించబోయిన కారు బోల్తా పడ్డ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయపడ్డారు.
అడవిపందిని తప్పించబోయిన కారు బోల్తా పడ్డ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయపడ్డారు. ఈ సంఘటన నారాయణఖేడ్ మండలం ర్యాలమడుగు గ్రామ శివారులో 50వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నిజాంపేట్ వైపు నుండి నారాయణఖేడ్‌కు వస్తున్న కారు ర్యాలమడుగు గ్రామ శివారులోకి రాగానే రోడ్డుపైకి అడ్డగం అడవిపందులు వచ్చాయని బాధితులు తెలిపారు.
వీటిని తప్పించబోగా అదుపుతప్పి రోడ్డు ప్రక్కన కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి సత్యంసేట్(45), కుమారుడు రోహిత్(13), తల్లి బాలమణి(70)లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించి ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.