కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రైస్ మిల్లు వద్ద నిద్రిస్తున్న కార్మికులపైకి శనివారం తెల్లవారుజామున లారీ దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఘటనలో మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కార్మికుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా బీహార్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. కార్మికుల మృతికి కారణమైన లారీ డ్రైవర్ పరారైయ్యాడు. క్లీనర్‌ను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.