
ఆటోను ఢీకొట్టిన లారీ..ఇద్దరి మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కరీంనగర్ నగునూరు గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని కరీంనగర్, వరంగల్ ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఒకరిది చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన పానుగంటి లక్ష్మయ్య(35)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.