మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి సమీపంలో నిజాంకొండపై ముగ్గురు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు.
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి సమీపంలో నిజాంకొండపై ముగ్గురు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. జూరాల నుంచి నీరు దిగువకు వదలడంతో కొండ చుట్టూ నీరు చేరుకుంది. దీంతో ఎటూ వెళ్లలేని పరిస్థితిలో.. కొండపైనే చిక్కుకున్న గొర్రెల కాపర్లు సాయం కోసం ఎందురు చూస్తున్నారు. మరోవైపు గొర్రెల కాపర్లను కాపాడేందుకు ప్రయత్నాలు చేపట్టారు.