తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 173 వంతెనల నిర్మాణానికి గాను 250 కోట్ల రూపాయల నిధులను విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 173 వంతెనల నిర్మాణానికి గాను 250 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వంతెనల నిర్మాణానికి నాబార్డు సాయం 200 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా యాభై కోట్ల రూపాయలు జమ చేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి అవసరమైన చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టాలని పంచాయతీరాజ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.