అభివృద్ధి పనులు పూర్తిచేయాలి- కలెక్టర్ నీతూప్రసాద్ | to complete government projects- collector Neetu Prasad | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు పూర్తిచేయాలి- కలెక్టర్ నీతూప్రసాద్

Published Sat, Feb 20 2016 2:04 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

అభివృద్ధి పనులు పూర్తిచేయాలి- కలెక్టర్ నీతూప్రసాద్ - Sakshi

అభివృద్ధి పనులు పూర్తిచేయాలి- కలెక్టర్ నీతూప్రసాద్

కరీంనగర్ : గ్రామాల్లో చేపట్టే ప్రభుత్వ భవన నిర్మాణాలు, రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, వ్యవసాయం, పశుసంవర్ధకశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రా మాల్లో  చేపడుతున్న పనులను లక్ష్యాలకు అనుగుణంగా పూ ర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు, స్త్రీశక్తి భవనాలు, అంగన్‌వాడీ భవనాల పనులు పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తే రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంటటామని  సూచించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో అర్హులకు ప్రభు త్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పశు సంవర్ధకశాఖ ద్వారా గొర్రెలు,పశువుల యూనిట్లను పెద్దఎత్తున జిల్లాలో మంజూరు చేయాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఏ.నాగేంద్ర, పంచాయతీరాజ్ ఎస్‌ఈ దశరథం, డీపీవో సూరజ్‌కుమార్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సుచరిత పాల్గొన్నారు.

ప్రతిభ కనబరిచిన అధికారులకు నగదు బహుమతులు
ఉపాధి హామీ పథకంలో లక్ష్యాలకు మించి అమలుచేయడంలో ప్రతిభ కనబరిచిన ప్రోగ్రాం ఆఫీసర్స్(ఎంపీడీవో), ఏపీవోలు, ఫీల్డ్‌అసిస్టెంట్లకు మూడు కేటగిరీల్లో నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్  తెలిపారు. మొదటి బహుమతి రూ.30 వేలు, రెండో బహుమతి 20వేలు, మూడో బహుమతి కింద రూ.10 వేల చొప్పున ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని జూన్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అందజేస్తామని తెలిపారు. గరిష్టంగా ఎక్కువమంది కూలీలకు పనులు కల్పించుట, మండలంలోని అందరూ ఉపాధి కూలీల బ్యాంక్ ఖాతాలకు వంద శాతం ఆధార్‌తో అనుసంధానం చేయించుట, వేగవంతంగా బిల్లులు చెల్లించుట, హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించుట, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, డంపింగ్ యాడ్స్, శ్మశాన వాటికలు, పశుగ్రాసం పెంపకం, పశువుల తాగునీటి తొట్ల నిర్మాణం, పంట మార్పు కల్లాలు, చెరువులలో పూడికతీత వంటి ప్రాధాన్యత గల పనులను వందశాతం పూర్తి చేసిన వారిని బహుమతులకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పోటీతత్వంతో నగదు బహుమతులు గెలుచుకునేందుకు అధికారులు కృషిచేయూలని సూచించారు.

భూమి కొనుగోలు పథకానికి సహకరించండి
భూమి కొనుగోలు పథకం కింద ప్రభుత్వం ద్వారా భూసేకరణకు రైతులు సహకరించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. కలెక్టరేటు సమావేశ మందిరంలో జమ్మికుంట, బోయినపల్లి, కోనరావుపేట, కాటారం మండలాల్లో భూమి అమ్మేందుకు ముందుకొచ్చిన వారితో చర్చలు జరిపారు. రైతుల సమ్మతి అనంతరం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు జేసీ నాగేంద్ర, కరీంనగర్, మంథని ఆర్డీవోలు చంద్రశేఖర్, శ్రీనివాస్, భూగర్భజల శాఖ సహాయ సంచాలకులు హరికుమార్, తహశీల్దార్లు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement