భద్రాచలం: మణుగూరు పవర్ ప్లాంట్ భూనిర్వాసితులకు నష్టం జరగకుండా ప్రభుత్వ నిబంధల ప్రకారం న్యాయం చేస్తామని కలెక్టర్ ఇలంబరితి అన్నారు. భూనిర్వాసిత రైతులతో ఆయన మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సమావేశమయ్యూరు. నష్ట పరిహారం పెంచాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలని, నగదు పరిహారం కాకుండా భూమి ఇవ్వాలని కలెక్టర్‌కు భూనిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత, కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారంగా భూనిర్వాసితులకు ఐదులక్షల రూపాయలుగానీ, ఇంటిలో ఒకరికి ఉద్యోగంగానీ, నెలకు రెండువేల రూపాయల పెన్షన్‌గానీ చెల్లించగలమని అన్నారు.
ఉద్యోగావకాశాలలో ముందుగా గిరిజనులకు ప్రాధాన్యమిస్తామన్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూములకు సంబంధించిన సర్వేను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో దివ్య, భద్రాచలం ఆర్‌డీవో అంజయ్య, డీడీ సరస్వతి, ఎస్‌డీసీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక రైతులకే నష్ట పరిహారం:జేసీ
పాల్వంచ రూరల్: గ్రామంలో నివాసముంటూ, భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు మాత్రమే నష్ట పరిహారం ఇస్తామని జాయింట్ కలెక్టర్(జేసీ), ఆర్ అండ్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ సురేంద్రమోహన్ స్పష్టం చేశారు. మణుగూర్ మండలంలోని తెలంగాణ జెన్కో పవర్ ప్లాంట్ భూనిర్వాసితుల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం స్థానిక ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించారు. రామానుంజపురం, చిక్కుడుగుంట, సాంబాయిగూడెం, దమ్మక్కపేట గ్రామాలకు చెందిన 110మంది రైతుల కుటుంబాలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జారుుంట్ కలెక్టర్ మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన అర్హతగల అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మధ్య దళారుల మాటలు నమ్మవద్దని కోరారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారికి ప్యాకేజీ వర్తించదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ కె.వెంకటేశ్వర్లు, మణుగూరు తహశీల్దారు, ఐటీఐ ప్రిన్సిపాల్ సందీప్, టి-జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురే ష్ తదితరులు పాల్గొన్నారు.
పవర్ ప్లాంట్ భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం
Published Wed, Dec 10 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM
Advertisement