చిట్యాల : గ్రామ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కాసర్ల రాంరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు గాజర్ల పోశాలు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాలలో ప్రచారం చేయాలన్నారు.
సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేష్‌గౌడ్, జిల్లా, మండల నాయకులు అల్లం రవీందర్, దేవేందర్‌రావు, గజనాల రవీందర్, నారాయణరెడ్డి, రాగుల మహేందర్, పెరుమాండ్ల రాజు, బుగులయ్య, పెరుమాండ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.