
నేడు జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం
నీలగిరి : ‘మన జిల్లా-మన ప్రణాళిక’ను సమీక్షించి ఆమోదింపజేసేందుకు ఆది వారం జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ దామోదర్‌రెడ్డి తెలిపారు. సమావేశానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వీరితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ, ఎంపీపీలు హాజరవుతారు. సమావేశంలో మన జిల్లా - మన ప్రణాళికకు సంబంధించి జిల్లా యంత్రాంగం రూపొందించిన నివేదికపై సమీక్ష చేస్తారు. అనంతరం ప్రణాళికను ఆమోదించి ప్రభుత్వానికి నివేదిస్తారు.